తాలిబన్ నేతతో ట్రంప్ చర్చలు..!

post

ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా బలగాలు తాలిబన్ల ఆగడాలకు అడ్డుకట్ట గా నిలిచిన సంగతి పాతదే. కాగా, ఆఫ్ఘన్ నుంచి తమ బలగాలను కొన్ని షరతులపై వెనక్కి తీసుకుంటున్నామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగం గా, జైలులో మగ్గుతున్న ఐదువేల మంది తాలిబన్లను విడిపించడానికి అమెరికా ఒప్పుకున్నా సంగతి కూడా తెలిసిందే. ఆఫ్ఘన్ గడ్డపై శాంతిని కొనసాగించాలని, తాలిబన్లు ఏవిధమైన హింస కలాపాలకు దిగిన, తాము రెట్టింపు వేగం తో వెనక్కి వస్తామని అమెరికా హెచ్చరించింది.

        తాజాగా, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాలిబాన్ అధినేత ముల్లా బరాదర్ తో 35 నిమిషాల పాటు ఫోన్ లో చర్చించారు. ఆఫ్ఘానిస్తాన్ లో శాంతి ని నెలకొల్పే దిశ గా చర్చలు జరిపినట్లు తెలిపారు. హింసకు తావు లేకుండా చేయాలని తాలిబన్లు కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు.