తిరుమలకు నో ఎంట్రీ...!

post

తిరుమలలో ఘాట్ రోడ్ మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎగువ ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలు నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న భక్తులను వెంటనే కిందకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మెట్ల మార్గం కూడా అధికారులు మూసివేశారు.
తిరుమలలో కరోనా అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఒక బృందంతో కలిసి కొండపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అతన్ని గుర్తించిన అధికారులు టీటీడీకి చెందిన ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతిలోని సిమ్స్‌కు తరలించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించిన అనంతరం టీటీడీ వెంటనే ఆకస్మాత్తుగా ఎగువ ఘాట్ రోడ్డు మూసివేసింది.ఆలయ వేళలను యథావిధిగా కొనసాగించాలా? లేదా దర్శన వేళలను సడలించాలా? అవసరమైతే ఆలయానికి దర్శనాన్ని నిలిపివేయాలా? ఆలయాన్ని మూసివేస్తారా? లేదా అనే అంశాలపై టీటీడీ మరో  నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు  సమాచారం.