కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ..!

post

కరోనా వైరస్ దేశం లోను విజృంభిస్తున్న నేపధ్యం లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయం లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉద్యోగులను మూడు వర్గాలుగా విభజించింది. వీరిలో అత్యవసర ఉద్యోగులు మొత్తం యాభై శాతం మంది వరకు కార్యాలయాలకు వచ్చి పనిచేయవలసి ఉంటుంది. వీరికి నిర్ణీత సమయాల్లో పనిచేసే వెసులుబాటు ను ఇచ్చింది. ఈ క్యాటగిరీ లోని ఉద్యోగులు  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు, ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు విధులు నిర్వహించనున్నారు.  కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కేంద్రం కలిపించింది. కాగా, మిగిలిన వారిని అత్యవసర పరిస్థితిల్లో తప్పనిసరిగా కార్యాలయాలకు రావాలని సూచించింది. ఈ ఉద్యోగులను వారం విడిచి వారం పనిచేసేలా ఉత్తర్వులిచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పని చేసే అభ్యర్థులు ఫోన్ మాధ్యమం ద్వారా అందుబాటులో ఉండాలని ఆదేశించింది. వయసు పై బడ్డ వారు, గర్భిణులు, మెడికల్ కండిషన్స్ లో ఉన్న ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తం గా ఉండాలని సూచించింది.