నిర్భయ దోషుల కొత్త ఎత్తు..?..విడాకుల కావాలంటూ అక్షయ్ భార్య..!

post

ఏడు సంవత్సరాల క్రితం నిర్భయ కు జరిగిన అన్యాయానికి సాక్ష్యం గా, అమ్మాయిలపై జరిగే అకృత్యాలను అరికట్టే లక్ష్యం తో నిర్భయ చట్టాన్ని ప్రారంభించారు. కానీ ఈ చట్టం తో నిర్భయకు న్యాయం జరగట్లేదని తెలుస్తోంది. చట్టం లోని లొసుగులని వాడుకుంటూ నిర్భయ దోషులు ఉరి శిక్షను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. నలుగురు దోషులు ఒకరి తరువాత ఒకరు క్షమా భిక్ష పిటిషన్లను వేసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి సమయం పడుతుండడం తో ఉరి శిక్ష వాయిదా అవుతూ వస్తోంది. ఇటీవల, సుప్రీం కోర్ట్ కూడా పవన్ గుప్త వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. అన్ని సక్రమం గా జరిగితే, రేపు వీరికి ఉరి శిక్ష పడాలి. ఇప్పటికే అందరు పిటిషన్లు వేయడం, అవి తిరస్కరించి బడడం పూర్తి కావడం తో, నిర్భయ దోషుల తరపు లాయర్ మరో కొత్త ఎత్తును వేసినట్లు తెలిసింది.

      సరిగ్గా ఉరి తీయడానికి ముందు నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ భార్య కోర్టులో పిటిషన్ వేసింది. ఇతన్ని రేపు ఉరి తీస్తే, నన్ను అందరు రేపిస్ట్ భార్య గా పిలుస్తారని, అది నాకిష్టం లేదని, వితంతువు గా బతకనని, నాకు అతని నుంచి విడాకులు కావాలని పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త అమాయకుడని, అతన్ని ఉరి తీసేముందు చట్టపరం విడాకులు ఇప్పించమని ఆమె కోరింది. రేపు ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ దోషులకు ఉరి తీయాల్సి ఉంది. ఈ నేపధ్యం లో ఆమె ఈ పిటిషన్ వేయడం దేశవ్యాప్తం గా చర్చనీయం గా మారింది. పిటిషన్ వేసిన తరువాత, ఆమె బయట కూర్చుని రోదిస్తూ ఉంది. తనకు బతకాలని లేదని, సచ్చిపోతానని అరుస్తూ సృహతప్పి పడిపోయింది. మెలకువ వచ్చాక తిరిగి అలానే రోదిస్తోంది. ప్రస్తుతం ఆమె పిటిషన్ వేయడానికి వెనుక కారణమేంటని పలువురు చర్చిస్తున్నారు.