కరోనా ఎఫెక్ట్..!

post

ముంబయ్ డబ్బావాలాలకు కూడ కరోనా ఎఫెక్ట్ తగిలింది. ముంబయిని వరదలు ముంచెత్తినపుడు కూడ డబ్బావాలాలు సమర్దవంతంగా తమ విధులు నిర్వర్తించారు.  అయితే ఇపుడు కరోనా కారణంగా మార్చి 31 వరకూ తమ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించారు. ముంబయిలో ఉద్యోగులకు లంచ్, టిఫిన్ బాక్స్ లు  వేళకు అందించే డబ్బావాలాల వ్యవస్ద కు మంచి పేరు వుంది. ముంబయి లైఫ్ లైన్ గా పేరొందిన సబర్బన్ ట్రయిన్ సర్వీసులు కరోనా కారణంగా నిలిపివేయడం, జనసమూహాలకు దూరంగా వుండాలని ప్రభుత్వాలు సూచించడంతో డబ్బావాలాలు సర్వీసులు నిలిచిపోయాయి.
      తెల్లచొక్కా, తెల్లటోపీ ధరించి సమయానికి లంచ్ బాక్స్ లు అందించే ముంబయ్ డబ్బావాలాలపై ప్రసిద్ది చెందిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం చేసింది. వీరిపై బాలీవుడ్ లో అంచ్ బాక్స్ సినిమా కూడ వచ్చింది. అయితే మారతున్న కాలానికి అనుగుణంగా డబ్బావాలా వ్యవస్దకు కూడ  పుడ్ డెలీవరీ యాప్స్, సర్వీసుల పేరిట కొన్ని  సవాళ్లు ఎదురవుతున్నాయి.