ఎయిర్పోర్ట్ వద్ద కొత్త స్క్రీనింగ్ విధానాలు..!

post

కరోనా వైరస్ ఇతర దేశాలనుంచి భారత్ ను చేరుతున్న నేపధ్యం లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ల వద్ద స్క్రీనింగ్ ను, కొన్ని దేశాలకు తప్పని సరి క్వారంటైన్ ను విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాసెస్ ముగిసి ప్రయాణికులు బయటకు రావడానికి చాల సమయం పడుతోంది. పైగా, అందరిని ఒకే చోట ఉంచడం తో వారి లో కరోనా లేని వారికీ కూడా ఉన్న వారి నుంచి వ్యాపించే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు. మాములుగా, ఇప్పటివరకు వచ్చిన అందరికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి టెంపరేచర్ ను చూస్తారు. పరిధి లోపల ఉన్న వ్యక్తులను, ప్రమాద తీవ్రత లేని (లేదా) తక్కువ ఉన్న వ్యక్తులకు పాస్పోర్ట్ లు ఇచ్చివేసి పదునాలుగురోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని సూచిస్తారు. అంతే కాకుండా, వారినుంచి విధిగా క్వారంటైన్ లో ఉంటామన్నఒప్పందం తో ప్రమాణ పత్రాన్ని తీసుకుంటారు. వీరిని ఐడిఎస్ అధికారుల పర్యవేక్షణ లో ఉంచుతారు. శరీర ఉష్ణోగ్రతలతో తేడా ఉన్నా, లేదా శారీరకం గా ఇతర ఇబ్బందులు ఉన్నా వారిని ఆసుపత్రికి తరలిస్తారు. హాస్పిటల్ క్వారంటైన్ లేదా హోటల్ క్వారంటైన్ దేనిని అయినా ఎంచుకోవచ్చు. పదునాలుగురోజులు అబ్సర్వేషన్ లో ఉంచిన తరువాత తిరిగి ఇంటికి పంపిస్తారు.

        కానీ, ఈ మొత్తం విధానం పూర్తి అవడానికి చాల సమయం పడుతోంది. ఒక్కోసారి ఆరుగంటలు దాటి పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. అందుకే ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ప్రతి ముప్పై మంది ప్రయాణికులకు ఓ ఐదుగురు వైద్య బృందాన్ని, ఓ సీఆర్పీఎఫ్ సిబ్బంది ని ఏర్పాటు చేసి స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ప్రమాద తీవ్రత లేని వారు త్వరగా వెళ్ళిపోతారు. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉన్నవారు హై రిస్క్, లో రిస్క్ అని రెండు గ్రూపులు గా విభజించి క్వారంటైన్ కు తరలిస్తారు. వేరు హోటల్ క్వారంటైన్ లేదా హాస్పిటల్ క్వారంటైన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు.