ట్రాఫిక్ పోలీసుల కొత్త ప్రయత్నం..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. జన సమూహాలను నిలువరించడం తో పాటు, కరోనా వైరస్ నిర్ములనకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహనా ను కలిపించడం లో కూడా ఇతర రాష్ట్రాలకంటే ముందంజలో ఉంది. ఈ నేపధ్యం లో తెలంగాణ పొలిసు యంత్రాంగం తాజాగా కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది.

         సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగిన సమయం లో, అక్కడకి కొంతమంది పోలీసులు ఓ బృందం గా చేరుకొని వైరస్ గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరిస్తూ, హాండ్స్ ను ఎలా వాష్ చేసుకోవాలో సైగల ద్వారా చేసి చూపిస్తూ, ప్రజలలో అవగాహనా పరిజ్ఞానాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియో ను షేర్ చేసారు. కొత్తపేట సర్కిల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని వీడియో తీసి రాచకొండ పోలీస్ వారు ట్విట్టర్ లో షేర్ చేసారు. ఈ వీడియో కు ట్విట్టర్ లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొఫెషన్ గా కన్నా ప్యాషన్ గా భావిస్తున్నట్లు డీజీపీ చెప్పగా, అది వారి సర్వీస్ లో స్పష్టం గా కనిపిస్తోందని ఓ వ్యక్తి కామెంట్ చేసారు. పోలీసుల కష్టానికి, వారు చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కి సరికొత్త అర్ధాన్ని ఇస్తున్నారు తెలంగాణ పోలీసులు.

https://twitter.com/RachakondaCop/status/1240558710860079105