టాయిలెట్ల విషయం లోనూ భారత్ నే అనుకరణ..!

post

కరోనా వైరస్ అమెరికా లో కూడా కరాళ నృత్యం చేస్తోంది. కేసుల సంఖ్యా ఎక్కువ అవుతుండడం తో, ఇప్పటికే అక్కడ ఆఫీసులను, స్కూల్స్ ను మూసివేసి జనాలు గుమి గూడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యం లో అమెరికా లోని అన్ని సూపర్ మార్కెట్లలోనూ టాయిలెట్ పేపర్ల కరువు ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్య గా అమెరికన్లు వాటిని ఎక్కువ మొత్తం లో కొని ఉంచుకుంటున్నారు. వీటి కోసం అక్కడ దొంగతనాలు కూడా జరుగుతున్నాయిట. ఈ మధ్య అక్కడ టాయిలెట్ పేపర్లు దొరక్కపోవడం తో వారు భారతీయ విధానాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

      సాధారణం గా, బ్రిటన్, అమెరికా వంటి దేశాలలోని పాశ్చాత్యులు మనలా నీటిని వాడకుండా టాయిలెట్ పేపర్లను వినియోగిస్తారు. ప్రస్తుతం అవి దొరక్కపోవడం తో వారి కట్టుబాట్లను కూడా మార్చేసుకుంటున్నారు. తాజాగా, ఓ అమెరికన్ తన బాత్ రూమ్ లో ఓ పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని, ఆ ఫోటో ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ '‘అమెరికా మేధావుల్లారా.. టాయిలెట్ పేపర్లను కొనడం కంటే ఓ చిన్న నీటి పైపును కొనుక్కోండి చాలు’’ అనే కాప్షన్ తో ట్వీట్ పోస్ట్ చేసాడు. ఇది వైరల్ అయింది.