కరోనా కారణంతో 168 రైళ్ల రద్దు..!

post

కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అత్యవసరమైతే తప్ప జనసమూహాలకు దూరంగా వుండాలని ప్రభుత్వం, మీడియా చేస్తున్న సూచనలు ప్రభావం చూపుతున్నాయి. దీనితో ప్రయాణాలు కూడ తగ్గాయి. . పలు రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో భారతీయ రైల్వేలు ఈనెల 20 నుంచి 31 వరకూ 168 రైళ్లను రద్దు చేశాయి. ఇక రద్దయిన రైళ్లలో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ సమాచారం వ్యక్తిగతంగా చేరవేశామని అధికారులు పేర్కొన్నారు. ఇక వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లలో జనసమ్మర్ధాన్ని తగ్గించేందుకు పలు రైల్వే జోన‍్ల పరిధిలో ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరలను పెంచారు.  దక్షిణమధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లలో  ప్లాట్ ఫారం టిక్కెట్ ధర రూ.10  నుంచి  రూ.50 కు పెంచిన విషయం తెలిసిందే.