ఆరుగంటలకో పారాసిటమాల్ చాలు..!

post

జలుబు, దగ్గు వస్తే భయపడాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఆరుగంటలకు ఒక సారి పారాసిటమాల్‌
వేసుకుంటే సరిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి పి.వి.రమేష్‌ తెలిపారు.రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి
నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.అందరూ మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని, చేతులు శుభ్రంగా
ఉంచుకుంటే సరిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వివరించారు. తీవ్రమైన జ్వరం,
దగ్గు ఉంటే 104కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం తరఫున ప్రత్యేక అంబులెన్స్‌ వస్తుంది. సమీపంలోని ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం
అందిస్తామన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుందని తెలుస్తోందని, బీపీ, షుగర్‌, కిడ్నీ
సమస్యలతో వున్నవారు జాగ్రత్తగా వుండాలని సూచించారు.