ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మృతి..!

post

గత కొన్నేళ్లు గా రేడియో వార్తలు చదివి శ్రోతల గుండెల్లో చోటు సంపాదించుకున్న న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి(80) గారు పైలోకాలకు చేరారు. నేటి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం లో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు. ఆమె మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఆమె తన సుస్వరం తో వార్తలు చదివేవారని గుర్తు చేసుకున్నారు.