కరోనా వైరస్ పై ప్రసంగించనున్న నరేంద్ర మోడీ..!

post

ఓ వైపు కరోనా వైరస్ దేశ వ్యాప్తం విస్తరిస్తోంది. ముంచుకొస్తున్న ముప్పు పై దేశ ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. ఇప్పటికే పలు బహిరంగ వ్యాపారాలు బంద్ చేసారు. సోషల్ డిస్టెన్స్ ను పెంచే విధం గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు నెలలకు సరిపడా రేషన్ ను అందించాలని చూస్తోంది. దేశ వ్యాప్తం గా కర్ఫ్యూ విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యం లో, ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

   ఇప్పటికే, కరోనా వైరస్ పై తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు బీజేపీ నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీలు ప్రజలను అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముంచుకొస్తున్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలతో ప్రసంగిస్తారని పీఎంఓ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి ని ఎదుర్కోవాలన్న అంశం పై నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.