ఉమ్మేస్తే రూ.1,000 కట్టాల్సిందే..!

post

ఎక్కడపడితే అక్కడ సిగరెట్లు త్రాగడం, ఉమ్మివేయడం, బహిరంగ మూత్ర విసర్జన.. ఇదీ దేశంలోని ప్రాంతాలకతీతంగా పట్టణాలు, నగరాల్లో పరిస్దితి. అయితే కరోనా వైరస్ నేపధ్యంలో అన్ని రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఒక్క  సారిగా పరిశుభ్రతపై దృష్టి సారించాయి. ముంబయి నగరంలో అయితే ఉమ్మివేస్తే రూ.1,000 జరిమానా గాని ఐపీసీ 189 సెక్షన్ కింద జైలుకి కాని వెళ్లవలసి వస్తుంది. బృహన్ ముంబయి మున్పిపల్ కార్పోరేషన్ తన ట్టిట్లర్ లో ఈ  విషయాలను తెలియ జేసింది. నిభందనలను ఉల్లంఘించినందుకుగాను ఇప్పటికే 107 మంది నుంచి  రూ.1,07,000 జరిమానాగా వసూలు చేసినట్లు తెలిపింది. కరోనా వంటి ప్రాణాంతక వైరస్ ను ఎదుర్కోనే నేపధ్యంలో నగరాన్ని పరిశుభ్రంగా వుంచేందుకుగాను కార్పోరేషన్ తీసుకునే చర్యలకు ముంబయి వాసులు తమ సహకారాన్ని అందించాలని కోరింది.