కరోనా ప్రభావం..ఆరు నెలల రేషన్ ఒకేసారి..!

post

కరోనా వైరస్ భారత్ ను కూడా ముట్టడించింది. కరోనా తీవ్రత ముదరకముందే భారత ప్రభుత్వం నివారణ చర్యలు ప్రారంభింస్తోంది. ఇప్పటికే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సినిమాహాల్స్, స్కూల్స్, కాలేజెస్ వంటి వాటిని బంద్ చేసారు. ప్రయాణికుల రద్దీ ఉన్నచోట థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి అనుమానితులను ఐసోలేషన్ వార్డులో చేర్చడానికి ఏర్పాట్లు చేసారు. ఇది ఇలా ఉంటె, కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు డెబ్భై మూడు కోట్ల మందికి సబ్సిడీ ద్వారా రేషన్ సరుకులను ప్రస్తుతం అందిస్తోంది. తాజాగా, వీరందరికి ఒకేసారి ఆరునెలల రేషన్ ను అందించాలని చూస్తోంది. దేశ వ్యాప్తం గా షట్ డౌన్ చేసే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

   ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం తన రాష్ట్ర ప్రజలకు ఆరు నెలలకు సరిపడా రేషన్ ను ఒకేసారి అందిస్తోంది. చాల మంది ప్రజలు, రెండు నెలలకు సరిపడా సరుకులను తీసుకుంటున్నారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా అందించే రేషన్ ను ఆరు నెలలకు సరిపడా ఒకేసారి అందించాలని భావిస్తోంది. గోడౌన్ లో కూడా ఆరు నెలలకు సరిపడా రేషన్ సామాగ్రి ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం భారత్ లో కూడా తీవ్రం అవుతుండడం చేతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.