కరీంనగర్ లో ఒక్కరోజే ఏడు  పాజిటివ్ కేసులు..!

post

రాష్ట్రము లో కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కానీ అవి తెలంగాణ ప్రాంత వాసులవి కాకపోయినా, విదేశాల నుంచి వచ్చిన వారివే అయినా తగు జాగ్రత్తలు తీసుకుని వారికి ట్రీట్మెంట్ ను ఇస్తున్నారు. ఇప్పటికే పలు స్కూళ్లను, కాలేజీలను, సినిమా హాళ్లను, మాల్స్ ను మూసివేసి సోషల్ డిస్టెన్స్ ను మైంటైన్ చేసే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇన్ని జాగ్రత్త్తలు తీసుకున్నా తాజాగా కరీంనగర్ లో ఒక్కరోజే ఏడు  పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రాంత వాసులను అప్రమత్తమయ్యేలా చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

              కాగా, వీరందరూ కూడా తెలంగాణ కు చెందిన వారు కాదు. ఇండోనేషియా నుంచి ఇక్కడకి చేరుకున్నవారు. వారు కరీంనగర్ లో సంచరించినట్లు తెలియడం తో పోలీసులు రంగం లోకి దిగారు. వారు ఎక్కడ నుంచి ఎక్కడికి తిరిగారు, ఎవరెవరిని కలిశారు అన్న వాటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా, సీసీ కెమెరాల సాయం తో వీరు ఎక్కడెక్కడ తిరిగి ఉంటారో సమాచారం సేకరిస్తున్నారు. ఇండోనేషియా నుంచి పదకొండు మంది ఢిల్లీ కి చేరుకొని, అక్కడి నుంచి తెలంగాణ కు నిన్నసంపర్క్ క్రాంతి ఎస్ 9 బోగీలో వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా రామగుండము వద్ద దిగారని సమాచారం. కరీం నగర్ ప్రాంత సమీపం లో ఓ మతపరమైన కార్యక్రమం లో పాల్గొన్నట్లు సమాచారం. కాగా, నిన్న క్రాంతి సంపర్క్ ఎస్ 9 బోగీలో ప్రయాణించిన అందరు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సింది గా అధికారులు సూచించారు. ప్రస్తుతం, పాజిటివ్ వచ్చిన ఈ ఏడుగురు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.