మానవత్వం మంటకలిసింది...!

post

నాగరిక సమాజంలో వున్నామన్న సృహ కూడ లేదు.. మానవత్వం అంతకన్నాలేదు. విదేశాలనుంచి వచ్చారన్న కారణంతో సొంత ఇంట్లోనుంచే ఇద్దరు వృద్దులను వెళ్లగొట్టారు. నగరంలోని ఆల్వాలో జరిగిన సంఘటన ఇది.  అల్వాల్‌లో ఓ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులు ఇటీవల విదేశాలకు వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న అపార్ట్‌మెంట్ వాసులు  కరోనా భయంతో వారిని ఇంటి నంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌ను నుంచి ఆ దంపతులను బయటకి గెంటివేశారు. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ అపార్ట్‌మెంట్‌ బయట కూర్చున్నారు. ఆ నివాస సముదాయంలో మొత్తం 50 కుటుంబాలు ఉన్నాయి.  వృద్దులను ఇలా వెళ్టగొట్టే బదులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇస్తే వారిని ఐసోలేషన్ కు తరలించేవారు. ఆమాత్రం కనీస జ్జానం కూడ లేకుండా అపార్టుమెంట్ వాసులు ఇలా ప్రవర్తంచడం దారుణమని పలువురు అంటున్నారు.