విదేశాల్లో 276 మంది భారతీయులకు కరోనా..!

post


విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. వీరిలో 255మంది ఒక్క ఇరాన్‌లో చిక్కుకున్నవారు కాగా, 12మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో ఉన్నట్లు తెలిపింది. ఇక హాంకాంగ్‌, కువైట్‌, రువాండా, శ్రీలంక దేశాల్లో ఒక్కరు చొప్పున భారతీయులు కరోనా బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే మనదేశంలో 150మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరిలో 25మంది విదేశీయులు ఉండగా మిగతావారు భారత పౌరులే. ఇప్పటి వరకూ ముగ్గురు మృతి చెందారు.. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.