పరీక్షలు రాయకుండానే పాస్... యూపీ సర్కార్ నిర్ణయం..!

post

కరోనా వైరస్ భయంతో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే, అందరూ ఉత్తీర్ణులయినట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యా శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రేణుకా కుమార్  వెల్లడించారు.
వాస్తవానికి యూపీలో మార్చి 23 నుంచి 28 వరకూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి వుంది. "విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని ఆదేశాలు జారీ చేశాము. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అన్ని పాఠశాలలూ ఏప్రిల్ 2 వరకూ మూసివేయబడి వుంటాయి. తదుపరి పరిస్థితిని బట్టి సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకుంటాం" అని ఆయన అన్నారు. మిగతా బోర్డు పరీక్షలు ఎప్పుడు జరపాలన్న విషయమై ఏప్రిల్ 2 తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.