ఫేస్ బుక్ ఉద్యోగులకు బోనస్ ...!

post

తమ ఉద్యోగులకు కరోనా వైరస్  బోనస్ అందించనున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌  ప్రకటించారు.  కోవిడ్‌ -19 (కరోనా వైరస్)  మహమ్మారి విస్తరిస్తున్న​ నేపథ్యంలో ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న ఉద్యోగుల  శ్రమను గుర్తించి జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎంతో శ్రమిస్తున్న ఉద్యోగులకు ఇలాంటి సమాయాల్లో బోనస్ ప్రకటించడం,వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నట్లు సీఈఓ జుకర్ బర్గ్ ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించారు. 
45వేలమంది ఉద్యోగులకు  రూ. 74,037 (1,000 డాలర్లు)నగదును బోనస్‌గా అందించనున్నారు.  .  ఫేస్‌బుక్‌ సీటెల్ కార్యాలయంలో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.  అలాగే కరోనా  వ్యాప్తిని  అడ్డుకునే చర్యల్లో భాగంగా  ఫిబ్రవరి 27న నిర్వహించాల్సిన వార్షిక సాఫ్ట్‌వేర్ డెవలపర్ల సమావేశాన్ని  కూడా  పేస్‌బుక్‌ రద్దు చేసింది. మరోవైపు కరోనా వైరస్‌తో ఇప్పటికే  7,987 మంది చనిపోగా,  1 లక్ష మందికి పైగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.