నో కరోనా సర్టిఫికెట్ వంటేనే ఆ వూళ్లోకి ఎంట్రీ.!

post

కరోనా.. దేశమంతా ఇపుడు దీనిపైనే చర్చ.. దీన్ని అడ్డుకోవడం ఎలా అన్నదానిపైనే ఆలోచన. పరిశుభ్రతతోనే దీన్నిఎదుర్కోవచ్చనేది ఇపుడు అందరికీ తెలిసిన విషయం. దీనితో వ్యక్గిగత, సామూహిక పరిసరాలను పరిశుభ్రంగా వుంచడం పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.  మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట  మండలం కన్మన్‌కాల్వ గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి గ్రామాన్ని శుభ్రం చేయించి, ఎక్కడకూడాచెత్తవేయరాదని ప్రచారం చేస్తున్నారు.  గ్రామానికి కొత్తగా హైదరాబాద్‌, ముంబాయి, పూణె , తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపరీక్షలు చేయించుకొని, కరోనా వైరస్‌ తనకు లేదనే సర్టిఫికెట్‌లో రావాలని గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేశారు.
 మరోవైపు నవాబ్ పేట ఎస్సై శ్రీకాంత్ కూడ కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలు
పోలీసులతో కరచాలనం చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చే వారు ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కొని స్టేషన్‌లో పోలీసులను సంప్రదించాలని కోరారు.