చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత..!

post

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యం లో చిలుకూరి బాలాజీ ఆలయాన్ని కూడా తాత్కాలికం గా మూసివేయనున్నట్లు ఆ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు తెలిపారు. కోవిడ్-19 వైరస్ కారణం గానే మార్చి పందొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ వారం రోజులపాటు స్వామి వారి ఆరాధన కొనసాగిస్తామని, కానీ భక్తులకు మాత్రం అనుమతి ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయం పై, దేవాలయ అర్చకులు పవన్ మాట్లాడుతూ, ప్రధాన అర్చకుల ఆదేశాలమేరకు దేవాలయం మూసి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే, తెలంగాణ ప్రభుత్వం సినిమా హాళ్లను, హాస్టళ్లను, స్కూల్స్ ను, కాలేజెస్ ను మూసివేసింది అని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మేము కూడా దేవాలయాన్ని మూసి ఉంచుతామని, పూజలు మాత్రం యధావిధిగా కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు.

   ఇంకా మాట్లాడుతూ, ఈ విషయం పై దేవాలయానికి వచ్చే భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. గుడికి వచ్చే భక్తుల సంఖ్య అధికం గా ఉంటుంది కాబట్టి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ అని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే, గుడి మూసివేత పట్ల వారు సమ్మతించినట్లు తెలిపారు.