కరోనా ఎఫెక్ట్... ఆమెజాన్ లో కొత్గగా లక్ష ఉద్యోగాలు..!

post

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్నీ బంద్ అవుతున్నాయి. షాపింగ్ మాల్స్, థియేటర్లు, వివిధ కంపెనీలు మూసేస్తుండడంతో చాలామంది  ఉద్యోగాలు కోల్పోతున్నారు. కానీ ఇలాంటి సమయంలో అమెజాన లో మాత్రం ఉద్యోగాల జాతర మొదలయింది. . ఏకంగా లక్ష మంది సిబ్బందిని నియమించుకోవాలని ఆమెజాన్ భావించింది.  ఎందుకంటే… కరోనా వైరస్ భయంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి అవసరమైన వస్తువులపై జనం ఆన్ లైన్ సైట్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోవడంతో అమెజాన్ అదనంగా వర్కర్లను నియమించుకుంటోంది.ఒక్క యూఎస్ లోనే లక్ష మంది వర్కర్లను తీసుకుంటోంది. యూకే, యూరోప్ లలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో… అక్కడి ప్రజలకు కావాల్సిన వస్తువులు అందజేసేందుకు చర్యలు తీసుకుంటోంది. యూఎస్ లోని వర్కర్లకు ప్రస్తుతం గంటకు రూ.1,112 చెల్లిస్తుండగా, అదనంగా మరో రూ.148 ఇస్తామని ప్రకటించింది. అదే విధంగా యూరోప్, యూకేలలో గంటకు రూ.179 ఎక్స్ ట్రా ఇవ్వనుంది.