రూ. కోటి ఇస్తాం..చికెన్ తింటే కరోనా వస్తుందని నిరూపించండి...!

post

చికెన్ తింటే కరోనా వస్తుందనే ప్రచారంతో కోళ్లు, గుడ్లు అమ్మకాలు పడిపోవడం తెలిసిందే. దీనితో పలు చోట్ల ఫ్రీగా చికెన్  పంపిణీ  కూడ జరిగింది. అయినా ఇంకా జనంలో చికెన్ పైన అనుమానాలు అలాగే వున్నాయి. దీనితో తమిళనాడులోని నామక్కల్ జిల్లా చికెన్ వ్యాపారుల సంఘం  . కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఎవరైనా నిర్ధారిస్తే..వారికి రూ. కోటి బహుమతి అందచేస్తామని వారు ప్రకటించింది.  కోళ్లను నాశనం చేసే ఆలోచన తమకు లేదని, ప్రజలు వదంతులు నమ్మకుండా..కోడి మాసం, కోడి గుడ్లను తినాలని వారు కోరుతున్నారు. ..కొన్ని రోజులుగా కరోనా భయం, పుకార్లతోకోడి మాంసం, కోడి గుడ్ల వ్యాపారం తీవ్ర నష్టాలకు గురయిందని. రూ. 4.50గా విక్రయించే కోడి గుడ్డు రూ. 1.30, కోడి మాంసం రూ. 80 నుంచి రూ. 20కి తగ్గిందన్న వ్యాపారులు  దీనికి కారణం సోషల్ మీడియాలో తప్పుడు వదంతులేనని ఆవేదన వ్యక్తం చేసారు.