డిగ్గీరాజా అరెస్ట్ ..!

post

 మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన  ఆ పార్టీ సీనియర్ నాయకులకు చేదు అనుభవం  ఎదురయింది. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా బెంగళూరులో  21మంది రెబల్‌ ఎమ్మెల్యేలు మకాం వేసిన సంగతి తెలిసిందే. మధ్య ప్రదేశ్  అసెంబ్లీని ఈ నెల 26 వరకూ వాయిదా వేస్తూ స్సీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీనితో తమకు కొంత సమయం దొరికిందని ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ నేతల్లో సుప్రీం కోర్టు నోటీసులు వేడిని పెంచాయి.మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలన్న విషయంపై వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో కాంగ్రెస్  సీనియర్ నేత దిగ్విజయ సింగ్ రంగలోకి దిగారు. బెంగళూరులో విడిది చేసిన తమ రెబల్ ఎమ్మల్యేలను కలుసుకునేందుకు వారు ఉన్న హోటల్ వద్దకు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ తో కలిసి వెళ్లారు. అయితే ఎమ్మల్యేలను కలవకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ధర్నాకు దిగారు.దీనితో 
దిగ్విజయ్‌, శివకుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరికొంతమంది కాంగ్రెస్‌ నేతలను అమృతహల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.