హాస్టళ్ల నెత్తిన కరోనా పిడుగు..!

post

విద్య, శిక్షణ, ఉపాధి  ఈ మూడు  రంగాల్లోనూ  దూసుకు పోతున్న నగరం హైదరాబాద్. రెండు తెలుగు రాష్ట్ర్రాలే కాకుండా దేశంలోనే  పోటీ పరీక్షలకు అత్యుత్తమ కోచింగ్ కేంద్రంగా హైదరాబాద్ కు పేరువుంది. మరో వైపు  సాఫ్ట్ వేర్ సంస్దల రాకతో ఈ రంగంలో  కొలువులు పొందుతున్న వారెందరో వున్నారు. నగరంలోని అమీర్‌పేట్‌ లో సాఫ్ట్ వేర్ కు సంబందించి శిక్షణ ఇచ్చే సంస్ల ఎన్నో వున్నాయి.   ఇక్కడ శిక్షణ కోసం, నగరంలో ఉద్యోగాల అన్వేషణకు , ఉద్యోగాలు వస్తే చేయడానికి వచ్చే అభ్యర్దులు ఎక్కవగా వుండటానికి అమీర్ పేటనే ఎంచుకుంటారు. ఎందుకంటే రవాణా పరంగా అనుకూలంగా వుంటుంది. ఇక్కడ వందల సంఖ్యలో హాస్టళ్లు వున్నాయి. ఇక్కడ హాస్లళ్ల బిజినెస్ మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ఇపుడు వీరందరిపై పిడుగు పడింది. అదేమిటంటే. కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా  అమీర్‌పేట్‌లో ఉన్న దాదాపు 850 హాస్టళ్లు, ఐటీ కోచింగ్‌ సెంటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ  ఆదేశించింది. ఈ మేరకు ఆయా హాస్టళ్లు, శిక్షణా సంస్థల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి నుంచిహాస్టళ్లను మూసివేసి విద్యార్థులను స్వస్థలాలకు పంపించాల్సిందిగా అధికారులు నిర్వాహకులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులను కాదని ఎవరైనా నిర్వాహకులు కోచింగ్‌ సెంటర్లు, వసతి గృహాలను నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీనితో హాస్టళ్ల నిర్వాహకుల్లో  అలజడి మొదలయింది. మరో వైపు వీటిలో వుంటూ జాబులు చేసుకునే వారు ఎక్కువగా ప్రైవేట్ రంగానికే చెందిన వారు కావడంతో  వారు కూడ అందోళన చెందుతున్నారు.