నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ..!

post

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సస్పెన్స్ కొనసాగుతోంది. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ని రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో నిబంధనల ప్రకారం 14 రోజుల తరువాతే దోషులని ఉరి తీయనున్నారు. రేపు ఉరి శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను పటియాలా హౌజ్ కోర్టు తోసిపుచ్చింది.  ఇంకోపక్క దోషులు నలుగురిని విడివిడిగా ఉరి తీయాలన్నకేంద్ర హోం శాఖ పిటిషన్‌పై ఈ నెల 5వ తేదీన సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి.