కరోనా క్వారంటైన్ స్టాంపులు..!

post

భారత్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం, అత్యధికం గా కరోనా కేసులు మహారాష్ట్ర లో నమోదు అయ్యాయి. ఈ నేపధ్యం లో, మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగం గా, ఇళ్లలోనే క్వారంటైన్ చేయబడ్డ కరోనా అనుమానితుల ఎడమ చేతి పై చెరిగిపోని సిరా తో స్టాంపు వేయనున్నారు. దీనితో, చెప్పకుండా వారు ఎక్కడికి వెళ్లినా గుర్తించే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టాంప్ పై 'ముంబై ప్రజలను రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను' అని రాసారు.

    గతం లో ఓసారి, ఓ నలుగురు కరోనా అనుమానితులు హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  దీనితో, అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆ స్టాంప్ పై ఎప్పటివరకు వారు క్వారంటైన్ లో ఉండాలో తెలిపే డేట్ ను కూడా వేశారు. కరోనా అనుమానితులు స్వీయ నిర్బంధాన్ని ఉల్లంఘిస్తే, ఇతరులు వారిని గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తం గా ఇప్పటివరకు 126 మందికి కరోనా సోకిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా మహారాష్ట్ర లో ఓ వృద్ధుడు కరోనా కారణం గా మరణించడం తో, మృతుల సంఖ్య ముగ్గురికి చేరింది.