భక్తులు రాకుండానే రాములోరి కళ్యాణం..!

post

కరోనా వైరస్ ఎఫెక్ట్ దేవుళ్లపైనా పడుతోంది. ఇప్పటికే భారత్ ఉజ్జయిని మహంకాళి, ముంబై లో సిద్ధి వినాయక ఆలయం, తుల్జా భవాని ఆలయం, గౌహతి లోని కామాక్షి ఆలయాలను మూసివేశారు. తాజాగా, ఈరోజు మూడు గంటలనుంచి షిరిడి దేవాలయంను కూడా మూసివేయనున్నారు. ఈ వైరస్ ఎఫెక్ట్ రాములోరి కళ్యాణం పై కూడా పడింది. భక్తులు రాకుండానే రాములోరి కళ్యాణం చేసేయాలని భద్రాద్రి ఆలయ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
    గుంపులు గుంపులు గా జనం గుమి కూడటం వల్ల వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే భద్రాచలం రామయ్య కల్యాణాన్ని కూడా కేవలం పూజారుల సమక్షం లోనే జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, మంత్రి పువ్వాడ అజయ్ ఈ ఏడాది భక్తులు లేకుండానే శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయని సెలవిచ్చారు. ప్రతి ఏడూ వైభవం గా జరిగే ఉత్సవాలు ఈ ఏడాది నిరాడంబరం గా జరుగుతాయని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా, భక్తులు ఇప్పటికే బుక్ చేసుకున్న కళ్యాణం టిక్కెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అధికారులు వారికీ తిరిగి డబ్బులు చెల్లిస్తారని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ, ప్రజలు కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవద్దని, కానీ అప్రమత్తం గా ఉండమని మంత్రి పువ్వాడ విజయ్ చెప్పుకొచ్చారు.