తిరుమల లో టైం స్లాట్ దర్శనం..!

post

కంపార్టుమెంటులో వేచి ఉన్నాక దర్శనానికి అనుమతినిచ్చే పద్దతికి టీటీడీ తాత్కాలికం గా నిషేధించింది. కంపార్టుమెంట్లలో గుంపులుగా ఉండడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడం తో ఈ విధానానికి తాత్కాలికం గా స్వస్తి చెప్పింది. ప్రస్తుతం టైం స్లాట్ పద్దతి ని అవలంబిస్తోంది. ఈ పద్దతి లో దర్శనానికి వచ్చే భక్తులకు కొండ వద్దే ఇచ్చే టికెట్ లో టైం ఫిక్స్ చేసి ఇస్తారు.

   ఈ టిక్కెట్లను తీసుకుని సరిగ్గా దర్శనం టైం కు క్యూలైన్ వద్దకు వస్తే, డైరెక్ట్ గా దర్శనానికి పంపించేస్తారు. వేచి ఉండటం, ఆగడం, గుంపులుగా ఉండటం వంటివి ఉండవు. తాత్కాలికంగానే అయినా, భక్తులు ఈ దర్శనాన్నే కోరుకుంటున్నారు. ఈ దర్శనం కూడా దాదాపు రెండు గంటలు పడుతోంది. అయితే, ఈ సమయం లో కూడా వైరస్ సోకె ప్రమాదం లేకపోలేదు. అందుకే చాలామంది ఈ టైం లో వెళ్లకపోవడమే మేలని భావిస్తున్నారు. టీటీడీ మాత్రం దర్శనానికి రావద్దని ఎలాంటి సూచలను చేయలేదు. కేవలం అనారోగ్యం తో ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావొద్దని సూచించింది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్యూ లైన్లలోకి అనుమతించడం లేదు. ప్రస్తుతానికి తిరుమల లో రద్దీ తక్కువగానే ఉంది. భారతీయులే కాక, విదేశీయులు కూడా చాల మంది స్వామి వారి దర్శనానికి వస్తారు. తిరుమల కరోనా కలకలం సృష్టిస్తున్నా..భక్తులు దర్శనానికి రావడం గమనార్హం. కరోనా అనుమానితులు గా ఉన్నవారిని రుయా ఆసుపత్రి లో ఐసోలేషన్ లో ఉంచుతున్నారు.