పాకిస్థాన్ బుద్ధి పోనిచ్చుకుంది కాదు..!

post

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యం లో ఇరుగు పొరుగు దేశాలతో సమన్వయము సాధించి, ఈ వైరస్ ను ఎదుర్కోవాలని ప్రధాని మోడీ భావించారు.  అయితే, ఇందుకోసం దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్​)లోని సభ్య దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కాన్ఫెరెన్స్ కి తొలుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాకపోవచ్చని, అసలు పాకిస్థాన్ స్పందించకపోవచ్చని అందరు అనుకున్నారు. కానీ, ‘మా స్పెషల్​ అసిస్టెంట్​ మీర్జా హాజరవుతార’ని పాక్​ ఫారిన్​ మినిస్ట్రీ ప్రకటించింది. ఈ కాన్ఫెరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్​లో ప్రెసిడెంట్లు​ గోటబయ రాజపక్స (శ్రీలంక), శర్మ ఓలి (నేపాల్​, లాటే త్సేరింగ్​ (భూటాన్),అష్రఫ్​ ఘని (అఫ్ఘాన్​), ఇబ్రహీం మహమ్మద్​ సాలిహ్​ (మాల్దీవులు),షేక్​ హసీనా (బంగ్లాదేశ్​) పాల్గొన్నారు. కాగా, ఈ కాన్ఫెరెన్స్ కు పాక్ ప్రధాని హాజరు కాకుండా, ఆయన స్పెషల్ అసిస్టెంట్ జఫర్​ మీర్జాని పంపించారు. 

ఎప్పుడు కాశ్మిర్ గోలే..!

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో హాజరైన ప్రధాన మంత్రులంతా కరోనా వైరస్ వ్యాప్తి కి తమ దేశం తీసుకున్న చర్యలను వివరిస్తూ వచ్చారు. కాగా, పాక్ ప్రతినిధి మాత్రం జమ్మూ కాశ్మిర్ లో ఇద్దరికీ కరోనా సోకినా విషయం పై ఆందోళన వ్యక్తం చేసారు. అసలు సమయం సందర్భం లేకుండా, కాశ్మిర్ పై పడటం పాకిస్తాన్ కు అలవాటైన సంగతే. ఓ వైపు పాకిస్తాన్ లో యాభై రెండు కేసులు నమోదు అయ్యాయి. అవేమి పట్టవు కానీ, కాశ్మిర్ లో నమోదైన రెండు కేసులపై వాదించడం మొదలెట్టింది. పైగా, 'సార్క్ దేశాలు తమ పరిధి లోని అన్ని ప్రాంతాలకు అత్యవసర సహాయాలను అందచేయాలను, కరోనా వైరస్ దృష్ట్యా కాశ్మిర్ పై అమలు చేస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని, అక్కడి సమాచారం బయటకు రావడం లేదని, అక్కడి అవసరాలు గుర్తించి సహాయక చర్యలు చేపట్టడానికి అవకాశం కల్పించాలని పాక్ ప్రతినిధి జఫర్​ మీర్జా చెప్పుకొచ్చారు.

      దీనిపై ఇండియా స్పందిస్తూ, "పాక్ ప్రతినిధికి మాట్లాడటమే రాలేదు. మనం చర్చిస్తోంది మానవీయ అంశం పైన, పాక్ దీనిని కూడా రాజకీయం చేయాలనీ చూస్తోంది" అని పేర్కొంది. అయినా పాక్ ప్రధాని ఇంత అవసరమైన విషయం లో చర్చకు రాకుండా, అస్సిస్టెంట్ ను పంపడం చర్చలకు దారి తీస్తోంది. నేపాల్ ప్రధాని శర్మ అనారోగ్యం తోనే చర్చకు వచ్చారు. అందరు తమ బిజీ షెడ్యూల్ ను పక్కకు పెట్టి చర్చకు వస్తే, పాక్ ప్రధాని మాత్రం తేలిగ్గా తీసుకోవడం పట్ల, వారికి ఈ విషయం పట్ల శ్రద్ద లేదని తెలుస్తోంది. అలాగే, ఇతర దేశాల్లో ఉన్న స్టూడెంట్లను తీసుకు రావడం పట్ల కూడా ఇండియా చురుగ్గా వ్యవహరించింది. పాకిస్తాన్ కి కూడా సాయాన్ని ఆఫర్ చేసిన పాకిస్తాన్ స్పందించకపోవడం తో, ఇండియా విద్యార్థులతో మాత్రమే ఎయిర్ లైన్స్ వెనుదిరిగాయి.

కరోనా వల్ల పాక్ కు నష్టం..!

అసలే పాకిస్తాన్ నష్టాలతో ఉంది..దానిపైన కరోనా కష్టం. పాకిస్తాన్ లో కూడా యాభై రెండు కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్ కు ఇరాన్ బోర్డర్ లో ఉండడం తో, అక్కడినుంచి వ్యాపిస్తోంది అని భావిస్తున్నారు. సింధు రాష్ట్రము లోనే అత్యధికం గా కేసులు నమోదు అయ్యాయి. కాగా, బోర్డర్ వద్దే క్వారంటైన్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నామని పాకిస్తాన్ తెలిపింది. ఇప్పటికే, పాకిస్తాన్ ఎకానమీ కి 6.10 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లింది. అయినా, పాకిస్తాన్ కి కాశ్మిర్ విషయం పై ఇండియా ను ఇరికించడమే ముఖ్యం గా భావిస్తోంది.