కెసిఆర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి..!

post

సోమవారం తెలంగాణ అసెంబ్లీ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సిఏఏ చట్టానికి వ్యతిరేకం గా తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్మానం పెట్టడం పట్ల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తాజాగా, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పై విమర్శలు గుప్పించారు.

  సిఏఏ ను వ్యతిరేకించడం అంటే, అది దేశ ద్రోహం కింద లెక్క అని, ఆ లెక్కన సీఎం కెసిఆర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలనీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. సీఏఏ, ఎన్సీఆర్, ఎన్పీఆర్ లపై సరైన విషయ పరిజ్ఞానం లేకే సీఎం కేసీఆర్ వాటిని వ్యతిరేకిస్తున్నారని ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు. సిఏఏ చట్టాన్ని పౌరసత్వం అందించడానికి తప్ప, తొలగించడానికి తీసుకురాలేదని, ఆ విషయాన్నీ కెసిఆర్ అర్ధం చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రాలకు చెందిన శాసన సభలు ఎలా వ్యతిరేకిస్తామని బండి సంజయ్ ప్రశ్నించారు. తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని ప్రతి చోట చెప్పుకొస్తున్న కెసిఆర్, బర్త్ సర్టిఫికెట్ లేకుండా ఆయన రాజకీయాల్లో ఎలా పోటీ చేస్తున్నారో, ఎన్నికలలో ఎలా నిలబడ్డారో చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిలదీశారు. బండి సంజయ్ ను ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి గా నియమించిన సంగతి తెలిసిందే.