గుర్రపు బండిపై చింతమనేని ప్రభాకర్ ప్రజా చైతన్య యాత్ర..!

post

ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈసారి రూట్ మార్చారు. కాస్త కొత్తగా ఉంటుందని అనుకున్నారో ఏమోగానీ వెరైటీగా గుర్రపు బండిపై వెళ్లారు. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు పాత సినిమాల్లో హీరో మాదిరిగా తన ఇంటి నుంచి గుర్రపు బండిపై బయల్దేరి వెళ్లి అందర్నీ ఆశ్చర్య పరిచారు. స్వయంగా తానే  గుర్రపు బండిని నడుపుకుంటూ వెళ్లారు. దెందులూరు మండలం పెరుగుగూడెం, చల్ల చింతలపూడి గ్రామాల్లో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు.