అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించిన నిర్భయ దోషులు..!

post

నిర్భ‌య అత్యాచారం, హ‌త్య కేసులో ఉరిశిక్ష ప‌డిన దోషులు ఆ శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. చ‌ట్టంలో ఉన్న లొసుగుల‌ను ఆధారంగా చేసుకుని ఒక‌రి త‌రువాత ఒక‌రు క్ష‌మాభిక్ష అని, రివ్యూ పిటిష‌న్ అని.. పిటిషన్ల మీద పిటిష‌న్లు వేస్తూ.. ఉరి శిక్ష వాయిదా ప‌డేలా చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో దోషి ముఖేశ్‌ సింగ్‌ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించండంతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కుటంబ సభ్యులు కారుణ్యమ మరణానికి రాష్ట్రపతికి లేఖలు రాస్తే...దోషులు ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అశ్రయించారు.