అరామ్ కో లాభం తగ్గింది...!

post

ముడిచమురు , ఉత్పత్తి, ధరలు  తగ్గడంతోసౌదీ అరామ్ కో నికర లాభం 2019 సంవత్సరంలో 20.6 శాతం తగ్గింది .గత డిసెంబరులో సౌదీ అరామ్ కో తొలి పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తర్వాత మొదటిసారిగా కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2018లో కంపెనీ నికర లాభం 11,110 కోట్ల డాలర్లు ఉండగా.. 2019 నాటికి 8,820 కోట్ల డాలర్లకు తగ్గిపోయింది. . . 2019 సంవత్సరానికి 7,320 కోట్ల డాలర్ల డివిడెండ్లను పంపిణీ చేయనున్నట్టు పేర్కొం ది.  2018లో కంపెనీ మూలధన వ్యయం 3,510 కోట్ల డాలర్లు ఉండగా.. 2019 సంవత్సరంలో 3,280 కోట్ల డాలర్లకు తగ్గింది