స్పెయిన్ లో చెలరేగిన కరోనా..!

post

చైనాలో పుట్టిన కరోనా క్రమేపీ అక్కడ తగ్గుముఖం పట్టగా స్పెయిన్‌లో  మాత్రంవిజృంభిస్తోంది.చైనా తరువాత ఇటలీ, స్పెయిన్ లో కరోనా ప్రభావం ఎక్కువగా వుంది. మిగతా దేశాలతో పోల్చితే అన్నింటికంటే వేగంగా స్పెయిన్‌లోనే వ్యాపిస్తోంది. ఒక్కరోజే 1,500 కేసులు నమోదయ్యాయి... గడిచిన 24 గంటల్లో 2,000 కొత్త కేసులు నమోదగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటివరకు . వైరస్‌ బారిన పడి 288 మంది మరణించగా,వైరస్ సోకిన వారి సంఖ్య  7,753కు చేరింది. . యూరప్‌లో ఇటలీ తర్వాత ఎక్కువగా ప్రభావితం అయిన దేశం స్పెయిన్‌. ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్‌తో 6,036 మంది ప్రాణాలు విడిచారు. 1,59,844 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ చైనాలోనే ఎక్కువగా 3,199 మంది ప్రాణాలు కోల్పోయారు.