కరోనా వాక్సిన్ కోసం ట్రంప్ కుట్ర..!

post

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ని హస్తగతం చేసుకొనేందుకు కుట్ర పన్నారని ఐరోపా మీడియాలో ప్రచారం జరుగుతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ పత్రిక ‘డై వెల్ట్‌’ ప్రచురించిన కథనం ప్రకారం. జర్మనీలోని ‘క్యూర్‌వ్యాక్‌’ అనే ఔషధ పరిశోధన సంస్థ కరోనా వైరస్‌ను నిర్మూలించే వ్యాక్సిన్‌ పరిశోధనల్లో కొంత పురోగతి సాధించింది. దీన్ని పసిగట్టిన ట్రంప్‌, ఆయన పాలకవర్గం దీన్ని హస్తగతం చేసుకోవాలని భావించారు. అందుకోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి వ్యాక్సిన్‌ హక్కుల్ని  అమెరికాకే పరిమితం చేసుకోవాలని భావించారు. . అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో ‘క్యూర్‌వ్యాక్‌’ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గత నెల భేటీ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. జూన్‌ లేదా జులై నాటికి కరోనాను అరికట్టే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని ‘క్యూర్‌వ్యాక్‌’ గతవారం ప్రకటించింది. తాజా ఆరోపణల్ని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి ధ్రువీకరించారు. దీంతో ‘క్యూర్‌వ్యాక్‌’ జర్మనీ నుంచి తరలిపోకుండా చూసేందుకు అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగిందని,.. పరిశోధనకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కూడ అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలసింది.