స్పీకర్ పోడియం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ నిరసన..!

post

సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)లను వ్యతిరేకిస్తూ శాసన సభలో తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. స్పష్టమైన అవగాహన తోనే, సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. అయితే, ఈ తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. దీనివల్ల ఏ ఒక్కరు నష్టపోరని ఆయన తెలిపారు. ముఖ్యం గా ముస్లిం ప్రజలకు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, దీనిని వ్యతిరేకిచరాదని ఆయన చెప్పుకొచ్చారు. సీఏఏతో దేశ ప్రజలకు ఎవ్వరికీ ఎలాంటి సమస్య ఉండదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ బిల్లు పై గతంలోనే చెప్పారని ఆయన గుర్తు చేసారు. అసెంబ్లీ లో TRS- MIM పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వాపోయారు. తెరాస పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన స్పీకర్ పోడియం వద్దకు చేరి నిరసన ప్రారంభించారు. ఓ వైపు పోడియం వద్ద గొడవ చేస్తుండగానే, తీర్మానాన్ని ఆమోదించేయడం తో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ తీర్మానాన్ని చింపేసారు.