అమెరికా వీసాలు బంద్..!

post

కరోనా వైరస్ కోరలు చాస్తున్న తరుణం లో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని అన్ని అమెరికా ఎంబసి లను, కాన్సులేట్లను తాత్కాలికం గా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి, అంటే మార్చి పదహారవ తేదీ నుంచి అన్ని రకాల వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నామని అమెరికా తెలిపింది. ఇదివరకే అపాయింట్మెంట్ ను తీసుకున్నవారు తిరిగి రీ షెడ్యూల్ చేసుకోవాలని అమెరికా ఎంబసి కోరింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే దాకా, వీసా మరియు కాన్సులేట్ కార్యకలాపాలను రద్దు చేస్తున్నామని తెలిపింది.

     కాగా, సోమవారం నుంచి చెన్నై, న్యూ ఢిల్లీ, కోల్ కతా, ముంబైలలోని అమెరికన్ సెంటర్లు 'ఇన్-పర్సన్ ప్రోగ్రామింగ్' ను మాత్రం పాస్ చేస్తాయని తెలిపింది. సాధారణం గా తెలుగు రాష్ట్రాలనుంచి చాలా మంది అమెరికా కు చదువుకోవడానికి, ఉద్యోగం కోసం వెళుతూ ఉంటారు. వారికీ ఇక్కట్లు తప్పేలా లేవు. మరోవైపు, నౌకలకు యుఎస్ నుంచి ప్రధాన క్రూయిజ్ లైన్ల ప్రయాణాలను కూడా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. "నా రిక్వెస్ట్ మేరకు కార్నివాల్, రాయల్ కరేబియన్, నార్వేయన్, ఎంఎస్సీ లాంటి అవుట్ బౌండ్ క్రూయిజ్ లను ఓ నెల రోజుల పాటు సస్పెండ్ చేసేందుకు అందరు అంగీకరించారు." అని ట్రంప్ తన ట్వీట్ లో తెలిపారు.