భారత్ లో వర్చ్యువల్ కోర్టులు..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో కేంద్రం తో పాటు, రాష్ట్రాలు కూడా అలెర్ట్ అయ్యాయి.  తాజాగా, సుప్రీమ్ కోర్ట్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయ విచారణలు డిజిటలైజ్ చేసే ప్రయత్నాల్ని ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి త్వరలోనే వర్చ్యువల్ కోర్టులను తీసుకు వస్తామని సుప్రీమ్ కోర్టు తెలిపింది. ప్రస్తుతం ట్రయల్ రూముల్లో పరిస్థితులు సమస్యాత్మకం గా ఉన్నాయని, కోర్టు ఆవరణలో వైరస్ ను వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సుప్రీమ్ కోర్టు తెలిపింది. వైరస్ వ్యాప్తి ని అరికట్టడానికి వర్చ్యువల్ కోర్టులను తీసుకొస్తామని జ‌స్టిస్ చంద్ర‌చూడ్ తెలిపారు. ఇప్పటికే అన్ని హై కోర్టులతోను చీఫ్ జ‌స్టిస్ బోబ్డే ట‌చ్‌లో ఉన్నారని, వర్చ్యువల్ కోర్టు ప్రారంభానికి తొలి అడుగును వేశామని, ఇక కేసు లను డిజిటల్ గా ఫైల్ చేయడమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. కాగా, ఇందుకోసం కోర్టులకు వచ్చే లాయర్లకు, దరఖాస్తు దారులకు మధ్య ఏకాభిప్రాయం ఉండడం తప్పనిసరి అని అన్నారు. ఇప్పటికే కోర్టుల్లో స్క్రీనింగ్ ను ప్రారంభించామని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.