11 మంది పిల్లల్ని కాపాడిన ఎల్ బి నగర్ పోలీసులు..!

post

అభం శుభం తెలియని చిన్నపిల్లని కొందరు దుర్మార్గులు ఎత్తుకొచ్చారు. వారిచేత కూలీపనుల్ని చేయించుకోవాలని చూసారు. కల్మషం తెలీని పసి మనసుల జీవితాలపై కర్కశత్వం రాయాలనుకున్నారు. వారి దుర్మార్గాలకు ఎల్బీ నగర్ పోలీసులు కళ్లెం వేశారు. ఆ బాలల్ని రక్షించారు. 
 వివరాలను పరిశీలిస్తే, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఓ బస్సు లో కొందరు చిన్నారులు అనుమానాస్పదం గా ఉన్నారు. ఈ విషయాన్ని బాలల సంరక్షణ అధికారులు గుర్తించారు. వెంటనే ఎల్ బి నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, ఆ పిల్లల్ని విడిపించి, సైదాబాద్ లోని చిన్నారుల శిబిరానికి పంపారు. కాగా, ఆ చిన్నారులకి ఛత్తీస్ ఘర్ నుంచి తీసుకువచ్చారని, వారితో కూలి పనులు చేయించాలనుకున్నారని, రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా కు తెలిపారు. అయితే, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం అని అన్నారు