అనిల్ అంబానీకి ఈడీ సమన్లు..!

post

మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్ బ్యాంకు పై దర్యాప్తు చేస్తున్న  ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ( ఈడీ)  రిలయన్స్ అధినేత అనిల్ అంబానీకి సమన్లు పంపింది.  అనిల్ ను సోమవారం తన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలపగా తన ఆరోగ్యం బాగా లేనందను తాను హాజరు కాలేనని ఆయన చెప్పినట్లు సమాచారం.
అనిల్ కు చెందిన రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) యెస్ బ్యాంకు నుంచి రూ.12,000 కోట్ల రుణాలను తీసుకుంది.  అయితే తిరిగి చెల్లించకపోవడంతో ఇది బ్యాంక్ ను దెబ్బతీసినట్లుగా ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ రుణాలు ఎన్ పీ ఏలు గా మారాయి.  వీటికి సంబందించి ఈడీ అనిల్ అంబానీని ప్రశ్నించే అవకాశముంది.
ఇటీవల కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్  మాట్లాడుతూ అనిల్ అంబానీ, ఎస్సెల్, ఐెఎల్ ఎఫ్ ఎస్, డీహెచ ఎఫ్ ఎల్ , వోడాఫోన్  సంస్దలు తీసుకున్న రుణాలు యెస్ బ్యంకు పతనానికి దారి తీసాయన్నారు.  యెస్ బ్యాంక్ వ్యవస్దాపకుడు  రాణాకపూర్, కుటుంబ సభ్యులు నిబందనలకు విరుద్దంగా రుణాలు మంజూరు, పొడిగింపు చేసి రూ.4,300 కోట్లు పొందారని ఈడీ ఆరోపించింది.