సీఎం కమలనాధ్ కు రిలీఫ్..!

post

మధ్యప్రదేశ్ సీఎం కమలనాధ్ కు ఊరట లభించింది. రాష్ట్ర అసెంబ్లీని మార్చి 26 వరకూ వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో ఆయన కు రిలీఫ్ దొరికినట్లయింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనారిటీ లో పడిన  విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యప్రదేశ్  అసెంబ్లీలో బలం నిరూపించుకోవలసిందిగా రాష్ట్ర  గవర్నర్ లాల్లీ టండన్ సీఎం  కమల్ నాధ్ కు సూచించారు. అయితే తమ ఎమ్మెల్యేలు కొంతమంది పర్యటనల్లో వున్నందున బలపరీక్షను వాయిదా వేయాలని సీఎం కమల్ నాధ్ గవర్నర్ ను కోరారు. అయితే ఇపుడు ఒక్కసారిగా స్పీకర్ 26 వరకూ సభను వాయిదా వేయడంతో  కమల్ నాధ్ కు పది రోజుల సమయం దొరికింది. హరియాణ, రాజస్తాన్ లలోని రిసార్టుల్లో వున్న బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భోపాల్ చేరుకున్నారు. అయితే సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరు నుంచి రాలేదు.