యూపీలో మరో కొత్త పార్టీ ..!

post

భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆజాద్‌ సమాజ్‌ పేరుతో  కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.    బహుజన్‌ సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్బంగా . నోయిడాలోని సఫాయి గ్రామంలో పార్టీ ని ప్రారంబించారు.. . నీలం రంగు మధ్యలో తెలుపు రంగుపై ఆజాద్‌ సమాజ్‌ పార్టీ అని రాసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. పార్టీ ప్రారంబించినప్పటికీ భీమ్‌ ఆర్మీ  దళితుల హక్కుల కోసం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆజాద్‌ తెలిపారు.
        2017 మేలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో దళితులకు, ఠాకూర్లకు మధ్య ఘర్సణల సందర్బంగా ఆజాద్‌ పేరు తొలిసారి తెరపైకి వచ్చింది. తర్వాత వారణాశిలో మోదీపై పోటీకి నామినేషన్‌ వేయడంతో మరోసారి ఆయన వార్తల్లో కెక్కారు.. అ. ఇటీవల దిల్లీలో సీఏఏ వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో  అరెస్టయిన అజాద్ కు.  దిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.