గవర్నర్ సార్.. ఇదేంటి?

post

అది రాజ్యంగ బద్దమైన పదవి.. చెప్పుకోవడానికి పోస్టు పెద్దదే.. అధికారాలు ఎక్కువే.. కాని వాడుకోవడాకి ఏమీ వుండవు. చాలమంది దాన్ని రబ్బరు స్టాంపు పదవి అంటారు. అంటే అధికారంలో వున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటిపైనా మాట్లడకుండా సంతకం పెట్టడం తప్ప ఇదేమిటని అడగానికి వుండదు. అదే గవర్నర్ పదవి.. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ తమ నాయకులకు రాజకీయ పునరావాసం కల్పించడానికి, రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా వున్న ప్రభుత్వాలను ఏమైనా చాన్స్ దొరికితే ఇబ్బంది పెట్టడానికి గవర్నర్లను వాడుకోవడం రివాజుగా మారింది.  మరి వీరు చేసేదేమిటంటే  సభలు, సమావేశాలకు హాజరుకావడం. రాజకీయ పార్టీల నాయకులు, సంఘాలు, పౌరసమాజం  ఎవరైనా వినతిపత్రాలు ఇస్తే
తీసుకోవడం.. పరిశీలిస్తామని చెప్పడం.. అయితే ప్రభుత్వ సౌకర్యాలు, లాంచనాలు వుండటంతో తరచుగా పర్యటనలు చేస్తూ వుంటారు. అవి తీర్దయాత్రలు కావచ్చు.. విహార యాత్రలు కావచ్చు. అడగడానికి ఎవరికీ లేదు. ఎందుకంటే గవర్నర్ రాష్ట్రానికి ప్రధమ పౌరుడు కాబట్టి. కాని సమయం, సందర్బం, అవసరం, ప్రాధాన్యతలను బట్టి వారు ప్రవర్తిస్తే బాగుంటందని విమర్శలు వస్తుంటాయి. గతంలో ఉమ్మడి ఏపీ గవర్నర్లుగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు తరచుగా తిరుమల పర్యటనకు వెళ్లడం పై ఒక రేంజ్ లో విమర్శలు వచ్చాయి. 

       ఇదంతా ఇపుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్  తాజాగా  తిరువనంతపురం జిల్లాలోని  పొన్ముడి హిల్ స్టేషన్ కి విహార యాత్రకు వెళ్లారు.
బాగానే వుంది. మరి సార్ వెళితే వెనకాల వుండే జనం కూడ ఎక్కువగానే వుంటారుకదా. వెనుక వుండే సహాయకులు, సెక్యూరిటీ అందరూ కలిసి 60 మందికి చేరారు. వీరందరూ  
అఃక్కడ వున్న గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో బస చేసారు. దీనిపై అధికార, ప్రతిపక్షనాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.  కేరళలో  22 కరోనా కేసులు నమోదయ్యాయి.  
11,000 మంది వ్యక్తులకు కరోనా వైరస్ సోకినట్లు అనుమానం .వీరందరినీ అబ్బర్వేషన్ లో వుంచారు.  సినిమాహాళ్లు, టూరిజం కేంద్రాలు అన్ని మూత పడ్డాయి. గవర్నర్ విడిది చేసిన పొన్ముడి హిల్ స్టేషన్ కూడ బంద్ చేసారు. ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడం పై ప్రణాళికలు రూపొందిస్తోంది.. సమావేశాలు నిర్వహిస్తోంది.. అందుబాటులో వున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఇలాంటి సమయంలో గవర్నర్ పర్యటన చేయడం ఏమిటి?  ఇదీ రాజకీయ పార్టీలు, నాయకులు చేసే విమర్శలు. మరి దీనికి కౌంటర్ గా గవర్నర్ కార్యాలయం  ఇచ్చిన వివరణ ఇదీ. గవర్నర్ ఊరికే పొన్ముడి లో పర్యటన చేయడం లేదు. ఆ ప్రాంతంలో వున్న గిరిజనుల స్దితిగతులను పరిశీలిస్తున్నారు. అక్కడ ఫారెస్ఠ్, రేంజ్ అధికారులతో సమావేశమయి గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నివారణపై చర్చించారు. బాగుందికదా..