బెంగాల్ లో కూడా ఏపీ లానే..!

post

ఏపీ బాటలోనే బెంగాల్ కూడ నడుస్తోంది.. ఏ విషయంలో నంటే స్దానిక సంస్దల ఎన్నికల నిర్వహణ పై. అయితే తేడా అల్లా ఒక్కటే. ఏపీలో స్దానిక సంస్దలను నిర్వహించాలని అధికార
పార్టీ భావిస్తుండగా అక్రమాలు, హింస చెలరేగి నందున ఎన్నికల ను ప్రతిపక్షం వ్యతిరేకించింది.  చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం
తీసుకున్న విషయం తెలసిందే.అయితే పశ్చిమ బెంగాల్‌లో  మాత్రం అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడ ఎన్నికలను వాయిదా వేయాలని కోరతున్నాయి. దీనికి  కూడ కారణం
కరోనా.పశ్చిమబెంగాల్లో త్వరలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను.  వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రంలోని విపక్షాలు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించాయి. . అనంతరం దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. 
   ఎన్నికలను ఏప్రిల్‌ 12 నుంచి 26 మధ్య నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు సూచించింది.  అయితే తాజాగా ‘‘ఎన్నికలు వస్తాయి.. పోతాయి. కరోనా మహమ్మారి
విజృంభిస్తున్న ఈ తరుణంలో రాజకీయాలకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఉమ్మడిగా ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కలిసిరావాలని అన్ని పార్టీలకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని
తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.