కాల్ డేటా పై డాట్ కు ఫిర్యాదు..!

post

టెలికాం శాఖకు చెందిన కొన్ని విభాగాలు నిభందనలకు విరుద్దంగా రికాైర్డెన కాల్‌ డేటాను బల్క్‌గా కోరుతున్నాయని పలు టెలికాం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు  టెలికాం కార్యద ర్శికి ఫిర్యాధు చేసాయి.. ఫిబ్రవరి 2,3, 4 తేదీల్లో రికాైర్డెన రాష్ట్ర వ్యాప్త సమాచారంతోపాటు మంత్రులు, ఎంపీలు, జడ్జీలు, ముఖ్యకార్యాలున్న రూట్లకు సంబంధించిన కావాలని ఢిల్లీ టెలికాం విభాగం తమను డిమాండ్‌ చేసినట్లు టెలికాం  సంస్దలు తెలిపాయి. .  ఆంధ్రప్రదేశ్‌లో 1, 5 తేదీల్లో, ఢిల్లీలో 18వ తేదీ, హరియాణాలో 21వ తేదీ, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము
కశ్మీర్‌లో నెలాఖరున, కేరళ, ఒడిశాల్లో 15వ తేదీ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌లలో గత నెలాఖరు, ప్రస్తుత నెల 1వ తేదీనకాల్‌ డేటా రికార్డులను కోరుతున్నాయని తెలిపాయి. 

        నిభందనల ప్రకారం కాల్‌ డేటా సమాచారాన్ని కోరే ముందు డాట్‌ విభాగం కచ్చితంగా వినియోగదారుడి పేరును వెల్లడించడంతో పాటు డేటాను కోరేందుకు సరైన కారణాన్ని చూపించాల్సి ఉంటుంది. సేకరించిన డేటాను ముందుగా వెల్లడించిన కారణం కోసం తప్ప.. వేరే ఏ ఇతర చర్యకు వినియోగించరాదు.. అయితే డాట్‌కు చెందిన పలు విభాగాలు వీటికి విరుద్దంగా , భారీగా కాల్‌ డేటాను అడుగుతున్నాయని టెల్కోలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి.