మీది హృదయం లేని బ్యాంక్..!

post

దేశీయ  బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియో క్లిప్‌ ప్రకారం..  .. ముఖ్యంగా అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం ఆయనేనంటూ నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ) ఒక హృదయం లేని బ్యాంకు. మీ అసమర్ధతే బ్యాంకును ఇలా తయారుచేసిందని మంత్రి  ఆగ్రహించారు. ఫిబ్రవరి 27న గువాహటిలో ఎస్‌బీఐ నిర్వహించిన కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రజనీష్‌పై ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను అఖిల భారత బ్యాంక్‌ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీవోసీ) ఖండించింది. ఎస్‌బీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకే గుర్తుతెలియని వారెవరో ఆడియో క్లిప్‌ను వైరల్‌ చేశారని, దీనిపై తక్షణం విచారణ జరపాలని పేర్కొంది. అయితే తిరిగి దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.