కరోనాను జయించిన యువకుడు..!

post

తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన తొలి కరోనా కేసులో బాధిత యువకుడు(24) కోలుకుని  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.. మహేంద్ర హిల్స్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుబాయ్‌ వెళ్లి  అక్కడినుంచి బెంగళూరు మీదుగా  హైదరాబాద్ వచ్చాడు. అతనికి కరోనా సోకినట్లు తెలియడంతో  సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స,   పర్యవేక్షణతో యువకుడి ఆరోగ్యం కుదుటపడింది. వ్యాధి నిర్దారణలో భాగంగా నమూనాలు తీసి గాంధీ మెడికల్‌ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. నెగెటివ్‌ అని తేలింది. 48 గంటల తర్వాత నమూనాలు సేకరించి మళ్లీ పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అక్కడినుంచి  కూడ  నెగెటివ్‌ అని రావడంతో అతను పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.