సిద్ధూ సొంత యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభం..!

post

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ సొంత యూట్యూబ్ ఛానల్‌ను శనివారం ప్రారంభించారు.జీతేగా పంజాబ్’ (పంజాబ్ గెలుస్తుంది) పేరుతో ప్రారంభమైన ఈ  ఛానల్ ద్వారా తాను ప్రజలతో చాలా సరళంగా మాట్లాడతానని, సమస్యలపై తాను గళమెత్తుతానని మొదటి వీడియోలో పేర్కొన్నారు.   తెలిపారు. . గురు నానక్ చూపిన సార్వజనీన సోదరభావం, సహనం, ప్రేమ, శాంతి బాట ఈ ఛానల్‌కు ప్రేరణనిచ్చినట్లు సిద్ధూ పేర్కొన్నారు. ఈ ఛానల్‌కు ఆదర్శమూర్తులు మహారాజా రంజిత్ సింగ్, షహీద్-ఏ-ఆజమ్ భగత్ సింగ్ అని పేర్కొన్నారు. వారు మన అద్భుతమైన గతం, సుపరిపాలన, ధైర్యసాహసాలు, త్యాగశీలతలకు ప్రతీకలని, భావి తరాలకు ఆదర్శప్రాయులని తెలిపారు. సిద్ధూ గత ఏడాది జూలైలో పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు.