గేట్ లో తెలుగోళ్లే గ్రేట్..!

post

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఐఐటీలు సంయుక్తంగా ఏటా గేట్‌ (గ్రాడ్యయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) ను
నిర్వహిస్తున్నాయి. దీంట్లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఓఎన్‌జీసీ, గెయిల్‌, హెచ్ పీ సీఎల్  తదితర 20 సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి  నియామకాలు చేస్తున్నాయి. గేట్ పరీక్షలో  ఒక్కసారి అర్హత సాధిస్తే ఆ స్కోర్‌కు మూడేళ్ల వరకు గుర్తింపు ఉంటుంది. ఈ  ఏడాది ఫిబ్రవరి 1, 2, 8, 9 తేదీల్లో 25 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహించారు. దీనిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్లులు మంచి ర్యాంకులను సాధించారు. పలు బ్రాంచీల్లో 20లోపు ర్యాంకులను తెలుగు విద్యార్దులు సాధించడం విశేషం.  వరంగల్ నిట్ కు చెందిన విద్యార్దులు 4 నుంచి 200 లోపు పలు ర్యాంకులు సాధించారు.